వారిద్దరినీ బ్లాక్‌ మెయిల్‌ చేసిన రష్మిక!

హీరోయిన్‌ రష్మిక మందన.. డైరెక్టర్‌ వెంకీ కుడుముల, హీరో నితిన్‌లను బెదిరిస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో ‘భీష్మ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెట్స్‌లో నితిన్‌తో కలిసి కబుర్లు చెబుతున్న ఫొటోను వెంకీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నేను నితిన్‌ అన్న డీప్‌ డిస్కషన్‌లో ఉన్నాం. వెనక రష్మిక ఏం చేస్తోందో మాకు తెలీదు’ అని ట్వీట్‌ చేశారు.

ఇందుకు రష్మిక స్పందిస్తూ.. ‘ఏయ్‌.. సెట్స్‌లో మాకు తెలీకుండా మీ ఇద్దరూ ఏం చేస్తుంటారో నెటిజన్లకు కూడా చూపించమంటారా? మీ ఇద్దరి ఫొటోలు బయటపెట్టనా?’ అని ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఇందుకు వెంకీ ప్రతిస్పందిస్తూ.. ‘పోస్ట్‌ చెయ్. మేమిద్దరం ఏం చేసేవాళ్లమో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది’ అన్నారు. మధ్యలో నితిన్‌ కలగజేసుకుని.. ‘సెట్స్‌ లోపలైనా, బయటైనా మేం కేవలం పని గురించే మాట్లాడుకుంటాం. కానీ, వెంకీ.. మీరు మధ్యలో ఎవరితో ఫేస్‌టైంలో మాట్లాడుతుంటారు?’ అని అడిగారు.

నితిన్‌ ట్వీట్‌కు రష్మిక సమాధానమిస్తూ.. ‘ఏయ్‌ నితిన్‌.. నువ్వాగు. తెర వెనుక ఏం జరుగుతోందో నేను అందరికీ చూపిస్తాను. ఎప్పటికీ మేం సింగిలే అంటుంటారు. ఆ ట్యాగ్‌టైన్‌ కేవలం నాకు మాత్రమే సూటవుతుంది. నీకు వెంకీ, వెంకీకి నువ్వు తోడుగా ఉన్నారు’ అంటూ సరదాగా కాసేపు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకున్నారు.