HomeTelugu Trendingరష్మిక నోట పెళ్లి మాట... ఆ ఇంటి కోడలు కావాలనే కోరిక!

రష్మిక నోట పెళ్లి మాట… ఆ ఇంటి కోడలు కావాలనే కోరిక!

Rashmika mandanna about her

టాలీవుడ్‌లో ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రష్మిక మందన్న. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. కన్నడ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా రష్మిక నోట నుండి మొత్తానికి పెళ్లి వార్త వినిపించింది.

ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక.. సుల్తాన్ సినిమాతో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి గా నటించిన ఈ కన్నడ బ్యూటీ.. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా భిన్నంగా అనిపించిందని తెలిపింది. అవి ఎంతగానో ఆకర్షించాయని, అక్కడ భోజనం, వంటలు చాలా రుచి గా ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ. తమిళ వంటకాలంటే చాలా ఇష్టమని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!