మహేశ్‌ బాబుతో రష్మిక

టాలీవుడ్‌లో ‘ఛ’లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి రష్మిక మందన్న. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే గీత గోవిందం, దేవదాస్‌ లాంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ సాండల్‌వుడ్‌లోనూ అదే జోరు చూపిస్తుంది. తాజాగా ఈ భామను ఓ అద్భుతమైన అవకాశం వరించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

సూపర్‌ స్టార్ మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్‌ గా ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్‌… నెక్ట్స్ యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.