HomeTelugu Trendingకొత్త ఇంటికి మారుతున్న రష్మిక మందన్న!

కొత్త ఇంటికి మారుతున్న రష్మిక మందన్న!

Rashmika shifting to new ho

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త ఇంటికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సామాన్లను ప్యాక్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో రష్మిక మళ్లీ కొత్త ఇల్లు కొనుక్కుందా ? అని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు. ఫిబ్రవరి 2021లో రష్మిక మందన్న ముంబైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం రష్మిక మిషన్ మజ్ను, గుడ్‌బై అనే రెండు హిందీ చిత్రాలలో నటిస్తోంది. అయితే బాలీవుడ్ సినిమాల షూటింగ్ కోసం హోటల్స్‌లో బస చేయకుండా ముంబైలో కొత్త ఇంటిని కొన్న రష్మిక ఇప్పుడు మళ్లీ ఇల్లుమారుతున్నట్లు తెలుస్తుంది.

ఇటీవలె రష్మిక హైదరాబాద్‌లో కనిపించింది. ఇక రష్మిక మందన్న చివరిసారిగా సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప : ది రైజ్’ లో శ్రీవల్లి పాత్రలో కనువిందు చేసింది. ఆమె ఇప్పుడు ‘పుష్ప : ది రూల్’ షూటింగ్ కోసం సిద్ధమవుతోంది. ఇది మార్చిలో ప్రారంభమవుతుంది. సీక్వెల్ 2022 డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.

కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

కొత్త ఇంట్లోకి రష్మిక… ఎప్పుడు మారుతోందంటే?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!