వరుణ్‌ బిగ్‌బాస్‌ లో ఎన్ని సార్లు కంట్రోల్‌ చేసుకున్నారు: రవి

హీరో వరుణ్‌ సందేశ్‌ అవకాశలు లేవు.. ప్రేక్షకులు దూరమౌతున్న టైమ్‌లో బిగ్ బాస్ పుణ్యమా అని మళ్లీ కాస్తో కూస్తో జనాల్లో కనిపిస్తున్నాడు. ఈ షో తర్వాత అవకాశాలు అయితే రావడం లేదు వరసగా ఇంటర్వ్యూలు అయితే ఇస్తున్నాడు. ఫైనలిస్ట్‌గా నిలిచి సత్తా చాటుకున్నాడు వరుణ్‌ సందేశ్‌. ఇక ఈ షోకు భార్య వితిక షెరూతో కలిసి మరీ వచ్చాడు. వీళ్లిద్దరి పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌తో మంచి స్నేహం ఉంది. ఈ నలుగురిని కలిపి PVVR అంటూ పిలుస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఈ నలుగురిని కలిపి ఇంటర్వ్యూ చేసాడు యాంకర్ రవి. ఈయన చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూను స్టార్ట్ చేసిన విధానమే వివాదాస్పదంగా మారుతుంది.

ఏకంగా వరుణ్, వితిక బెడ్రూమ్ విషయాలపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేసాడు రవి. అలాగే తన ఇంటర్వ్యూను మొదలు పెట్టాడు. అచ్చంగా బిగ్ బాస్ మాదిరే ఓ ఫోన్ కాల్ చేసి అక్కడ్నుంచి ప్రశ్నల వర్షం మొదలుపెట్టాడు ఈయన. అక్కడ ఫోన్ రింగ్ కాగానే కంటెస్టెంట్స్ వెళ్లి మాట్లాడాలి. అందులో బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందులో ఎవరైతే ఆసక్తికరంగా సమాధానమిస్తారో వాళ్లకు బిగ్ బాస్‌ని చూసే అవకాశం ఇస్తారని చెప్తాడు రవి. మొదట వరుణ్ సందేశ్ వెళ్లి మాట్లాడగా అతడితో చాలా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు యాంకర్ రవి. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. వరుణ్ మీరు బిగ్ బాస్ హౌస్‌లో బెడ్ రూంలో బెడ్ మీద ఎన్నిసార్లు కంట్రోల్.. కంట్రోల్ అని వితికా నువ్వూ చెప్పుకున్నారని అడిగాడు రవి.

ఏంటి బిగ్ బాస్ మీరు.. మీరేం అంటున్నారో నాకు అర్ధం కావడంలేదని వరుణ్ చెప్పినా.. మీకు అర్ధమైంది అని నాకు అర్థమైంది వరుణ్.. చెప్పండి మీరు ఎన్నిసార్లు బెడ్ మీద కంట్రోల్ కంట్రోల్ అని అనుకున్నారు అంటూ మళ్లీ అదే ప్రశ్న రిపీట్ చేసాడు రవి. అదేంటి బిగ్ బాస్ అలా అడుగుతున్నారు.. మనది ఫ్యామిలీ షో కదా అంటూ వరుణ్ చెప్పినా కూడా నేను మిమ్మల్ని ఏ ఉద్దేశంతో అడుగుతున్నానో మీకు తెలుసు.. చెప్పిండి మీరు ఎన్నిసార్లు కంట్రోల్ కంట్రోల్ అని అనుకున్నారని రవి మళ్లీ అడిగాడు. దాంతో సమాధానమిచ్చాడు వరుణ్ సందేశ్. ఈ హౌస్‌లో నాకు ఆ ఆలోచన నాకు రాలేదు బిగ్ బాస్. మీకు ఏం చెప్పాలో నాకు అర్ధం కావడంలేదు అని చెప్పాడు ఈయన.

మీ ఆవిడ పక్కనున్నప్పుడు కూడా ఆ ఆలోచన రాలేదా.. అని మరో పిచ్చి ప్రశ్న వేశాడు రవి. దాంతో తనకు అలాంటి ఆలోచన రాలేదని.. ఎందుకంటే తాము వెళ్లింది ఓ రియాలిటీ షోకి తప్ప హనీమూన్‌కి కాదనే విషయం తనకు తెలుసని చెప్పాడు. అందుకే తనకెప్పుడు ఆ ఆలోచన రాలేదని కుండబద్దలు కొట్టేశాడు వరుణ్ సందేశ్. అక్కడితో కూడా ఆగకుండా సరే మీ ఆవిడని చూస్తే ఆ కోరిక కలగలేదు.. మరి ఎవర్ని చూస్తే కోరిక కలిగిందని అడిగాడ రవి. తనకు ఎవర్ని చూసినా అనిపించలేదని వరుణ్ చెప్పడంతో.. పోని మీకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నా.. అని బాబా భాస్కర్, రాహుల్‌లను ఆప్షన్‌గా ఇచ్చాడు. ఎవరూ లేరని చెప్పడంతో అక్కడితో ఈ బూతుపురాణానికి ఫుల్ స్టాప్ పడింది. ఇదంతా కావాలనే చేసింది అయినా కూడా మరీ ఇంతగా దిగజారిపోయి యాంకరింగ్ అవసరం లేదనేది ప్రేక్షకులు చెబుతున్న మాట.