HomeTelugu Trending'ఈగల్‌' ట్రైలర్‌ అప్డేట్

‘ఈగల్‌’ ట్రైలర్‌ అప్డేట్

ravi teja eagle movie trail
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, స్టైలిష్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రేపు సాయంత్రం 5:04 గంటలకు ట్రైలర్‌ లాంఛ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఓ పోస్టర్‌ విడుదల చేశారు. మాస్‌ మహారాజా సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా.. ఈగల్‌లో మిగిలిన పాత్రలు ఎలా ఉండబోతున్నాయని పోస్టర్‌తో హింట్ ఇచ్చేశారు‌. ఈగల్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈగల్ టార్గెట్‌ ఫిక్స్‌.. సరైన షాట్‌ లక్ష్యంగా పెట్టుకుంటే.. అంటూలాంగ్‌ హెయిర్‌తో గుబురు గడ్డంతో ఉన్న రవితేజ గన్‌ పెట్టుకొని టార్గెట్‌పై గురి పెట్టిన ట్రైలర్‌ అప్‌డేట్‌ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రవితేజ లాంగ్ హెయిర్‌, గడ్డంతో బ్లాక్ స్టైలిష్‌ గాగుల్స్ పెట్టుకొని.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తూ.. ఈగల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాడు.

రవితేజ మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్‌ పట్టుకుని ఉన్న కాన్సెప్ట్‌ పోస్టర్‌తో ఈగల్‌ విధ్వంసం ఎలా ఉండబోతుందో తెలియజేశారు. ఈ మూవీకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. రవితేజ దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu