HomeTelugu Trendingసెట్స్‌పైకి రవితేజ 'మిస్టర్‌ బచ్చన్‌'

సెట్స్‌పైకి రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’

Ravi Teja Mr Bachchan on

మాస్ మహారాజా రవితేజ.. సినిమాలు విజయాపజయాలను పక్కన పెట్టేసి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఈగల్ తో సంక్రంతి రేసులోకి దిగుతున్నాడు.

ఇంకోపక్క మరో కొత్త చిత్రాన్ని సెట్ మీదకు తీసుకెళ్లిపోయాడు. హరీష్ శంకర్- రవితేజ కాంబోలో వస్తున్న చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నేడు సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

రవితేజ ముఖంపై క్లాప్ బోర్డు ను చూపిస్తూ.. ఇది ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో మిరపకాయ్, షాక్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరూ కొత్త కథతో రాబోతున్నారు. నిజం చెప్పాలంటే హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాతో బిజీగా ఉండాలి. కానీ, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది. ఏపీ ఎలక్షన్స్ అయ్యాకా కానీ, పవన్ మళ్లీ సెట్ లో అడుగుపెట్టడు. ఈలోపు హరీష్, రవితేజతో మిస్టర్ బచ్చన్ ను పూర్తిచేయనున్నాడు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu