HomeTelugu Newsరవితేజ 'ఖిలాడి'!

రవితేజ ‘ఖిలాడి’!

6 26
టాలీవుడ్‌ హీరో మాస్‌మహా రవితేజ ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తాడు. అందులోనే తనదైన శైలిని చక్కగా జొప్పిస్తాడు. అయితే గత కొంత కాలంగా విజయాలకు కాస్త దూరంగా వున్నాడు. ఈ క్రమంలో తాజాగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రవితేజ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ, అదంతా ఒట్టిదేనని చిత్రయూనిట్‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయనుండడం మరో విశేషంగా చెబుతున్నారు.

ఇదిలావుంటే.. ఈ చిత్రానికి తాజాగా ‘ఖిలాడి’ అనే టైటిల్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోతుందని ఈ టైటిల్‌ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu