
Kushi Kapoor Replaces Sreeleela :
శ్రీలీల, తెలుగులో ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన హవా చూపించబోతోంది. ఈ మధ్యే శివ కార్తికేయన్‌తో కలిసి ‘పరాశక్తి’ అనే చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలోనే శ్రీ లీలా కి పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తోంది.
గతంలో ఒక సినిమాతో శ్రీలీల హిందీలో.. అడుగు పెట్టాల్సి ఉండగా ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. తాజాగా ఏ హీరోయిన్.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి సినిమా చేయబోతోంది అనే వార్తలు చూడండి ఉన్నాయి
View this post on Instagram
కానీ బాలీవుడ్ సమాచారం ప్రకారం.. జాన్వీ కపూర్ చెల్లెలు, ఖుషి కపూర్, ఈ సినిమాలో శ్రీలీల స్థానాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం అలీ ఖాన్ మొదటి సినిమాలో ఖుషి కపూర్ హీరోయిన్గా ఖరారు అయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ చిత్రం “నడానియాన్” అనే పేరుతో..నెట్‌ఫ్లిక్స్ నిర్మాణ బాధ్యతలు వహించనుంది అనే వార్తలు కూడా వస్తున్నా. దీంతో, ఈ ప్రాజెక్టు పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీలీలకి పెద్ద షాక్ తగిలినట్టు వినికిడి.