HomeTelugu Trending'రావణాసుర'గా రవితేజ

‘రావణాసుర’గా రవితేజ

Ravi Teja Ravanasura movie

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలను ప్రకటించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో గజదొంగ నటిస్తున్నట్లు తెలిపాడు రవితేజ. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా 70వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ”రావణాసుర” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. ”హీరోలు ఉనికిలో లేరు.. కానీ రాక్షసులు ఉన్నారు.. రావణాసుర రాక్షసులందరికీ బాప్” అని చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ ను దశముఖ రావణాసుర గా పరిచయం చేశారు.

భయంకరమైన బ్యాక్ గ్రౌండ్ లో రవితేజ ఒక లాయర్ లుక్ లో సీరియస్ గా చూస్తున్నాడు.. ఇక చుట్టూ ఉన్న తొమ్మిది ముఖాలు కూడా అదే ఇంటెన్సివ్ లుక్ తో కనిపించాయి. రక్తం, గన్స్, స్పెషల్ గా రవితేజ చేతిలో సుత్తి సినిమాపై అంచనాలను పెంచేశాయి. రావణాసుర అంటేనే పదితలలు.. పది ముఖాలు.. మరి ఈ సినిమాలో రవితేజ కూడా పది వేరియేషన్స్ లో కనిపించనున్నాడని టాక్.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!