శ్రీనువైట్లకు వెయిటింగ్ తప్పడంలేదు!

ఒకప్ప్తటి స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ మధ్య కాలంలో బాగా డల్ అయిపోయారు. వరుస ఫ్లాపులు ఆయనను చుట్టుముడుతున్నాయి. దాంతో హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో తనను హీరోగా నిలబెట్టిన వైట్లతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రవితేజ. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం మైత్ర్హి మూవీ మేకర్స్ వారు సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తున్నారు. అలానే చందు మొండేటితో కలిసి ‘సవ్యసాచి’ సినిమాను కూడా మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత శ్రీనువైట్లతో సినిమా చేస్తామని అన్నారట.

ఆలస్యం అవుతుందనుకుంటే మరో నిర్మాతతో సినిమా చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వైట్ల కొంతకాలం పాటు ఎదురుచూస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం అవుతుందని సమాచారం.