రవితేజ ‘రాజా ది గ్రేట్’!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం ‘రాజా ది గ్రేట్’. ‘వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌’ క్యాప్ష‌న్‌. ఈరోజు హైద‌రాబాద్‌లో ఈ సినిమా లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ర‌వితేజ‌, మెహ‌రీన్‌ల‌పై ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో, నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా….

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ”ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది” అన్నారు. 

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ”ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తాం” అన్నారు.