రీమేక్ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్!

‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత బాగా గ్యాప్ తీసుకున్నాడు రవితేజ. అయితే ఈ ఏడాది రెండు సినిమాలను పట్టాలెక్కించాడు. విక్రమ్ సిరి దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ నేపధ్యంలో రవితేజ మరో రీమేక్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలో తెరకెక్కించిన ‘బోగన్’ సినిమాకు అక్కడ మంచి క్రేజ్ వచ్చింది.

జయం రవి, అరవింద్ స్వామి కాంబినేషన్ లో రూపొందింన ఈ సినిమాకు దర్శకుడు లక్ష్మణ్. ఇప్పుడు ఈ దర్శకుడు ఈ సినిమాను తెలుగులో కూడా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో జయం రవి పాత్ర కోసం ఆయన రవితేజను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన రవితేజను సంప్రదించగా కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అరవింద్ స్వామి పాత్రలో ఎవరిని తీసుకోబోతున్నారో తెలియాల్సివుంది!