రవితేజకు ‘క్రాక్’ అంట!

rt1

రవితేజ టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇడియట్, దుబాయ్ శీను, బెంగాల్ టైగర్ ఇలా
సినిమా టైటిల్ లోనే వైవిధ్యత చూపిస్తాడు. తాజాగా రవితేజ కోసం మరో భిన్నమైన టైటిల్ ను
కన్ఫర్మ్ చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ లో
‘క్రాక్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఇది రవితేజ సినిమా కోసమే అనే ఊహాగానాలు
వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఈ టైటిల్ ను సెలెక్ట్ చేశారని
కొందరు చెప్పుకుంటుంటే.. జంట దర్శకులతో రవితేజ చేయనున్న సినిమా కోసమని మరికొందరు
అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారీటీ వచ్చే అవకాశం ఉంది. బెంగాల్ టైగర్
సినిమా తరువాత రవితేజ ఇప్పటివరకు మరో సినిమా పట్టాలెక్కించలేదు. ఆయన సినిమా
కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు!!

CLICK HERE!! For the aha Latest Updates