అనుష్కకు అసలు గ్యాప్ దొరకట్లేదుగా..!

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే ఇటు గ్లామరస్ పాత్రల్లోనూ మెప్పిస్తోంది. ప్రస్తుతం అమ్మడు దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తోన్న ‘బాగమతి’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు ముప్పై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇంత భారీ బడ్జెట్ తో రూపొందడం ఇదే మొదటిసారి.
అందుకే ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసంబర్ మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఆ నెలలో స్టార్ హీరోల సినిమాలు క్యూ కడుతుండడంతో ‘భాగమతి’ కి మరో నాలుగు నెలల వరకు గ్యాప్ దొరికే ఛాన్స్
కనిపించడం లేదు. పోనీ ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామనుకుంటే సంక్రాతికి రావాలనుకున్న సినిమాలు వాయిదా పడి ఫిబ్రవరిలో వెండితెర మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఓం నమో వెంకటేశాయ, గురు, విన్నర్ వంటి సినిమాలు కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదలకు రెడీ అవుతున్నాయి.
మార్చి నెలలో పవన్ కాటమరాయుడు, అలానే మహేష్ బాబు సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఏప్రిల్ లో బాహుబలి సినిమా రానుంది. మరో ఆరు నెలల వరకు అనుష్క సినిమా రిలీజ్ అవ్వడానికి గ్యాప్ దొరకట్లేదు.