పవన్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ ఫోన్..?

‘పవర్’ చిత్రంతో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుడు బాబీ ఆ తరువాత పవన్ కల్యాణ్
హీరోగా ‘సర్ధార్ గబ్బార్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్
కాకపోవడంతో బాబీ డీలా పడ్డాడు. దీంతో రవితేజ పిలిచి మరీ బాబీకు మరొక అవకాశం ఇచ్చారు.
అయితే వారిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళడం లేదు. ఇది ఇలా ఉండగా.. ఈ మధ్యన
బాబీకు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. జనతాగ్యారేజ్
సినిమా తరువాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తనకోసం కథలు సిద్ధం చేసిన దర్శకులకు
ఫోన్ చేసి పిలిపించి మరీ కథలు వింటున్నాడట. అలానే బాబీ కూడా ఫోన్ చేసి కథ చెప్పమని
అడిగినట్లు సమాచారం. దాంతో బాబీ ఎన్టీఆర్ కు కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. బాబీ
గనుక తన కథతో ఎన్టీఆర్ ను మెప్పిస్తే త్వ్రలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే
అవకాశాలు కనిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates