HomeTelugu Trending'బిగ్‌బాస్‌'కు హైకోర్టులో ఊరట

‘బిగ్‌బాస్‌’కు హైకోర్టులో ఊరట

6 16

తెలుగు బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని బిగ్‌బాస్‌ నిర్వాహకుడు అభిజిత్ ముఖర్జీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటి వరకు అరెస్టు వంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. యాంకర్ శ్వేతరెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్, నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్‌స్టేషన్లో బిగ్‌బాస్‌ నిర్వాహకులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు సినీనటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ఈ నెల 21 నుంచి ప్రసారం కానుంది.

ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల హెచ్చరికలతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద భద్రత పెంచారు. బిగ్‌బాస్‌ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని, షో ను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఇందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటి పోలీసులను కాపాలా ఉంచారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu