HomeTelugu Trending'టైగర్‌ నాగేశ్వర రావు' నుండి రేణు దేశాయ్ లుక్

‘టైగర్‌ నాగేశ్వర రావు’ నుండి రేణు దేశాయ్ లుక్

renu desai first look from

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వర రావు’. 1970లో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కృతి స‌న‌న్ చెల్లి నుపుర్ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. అక్టోబ‌ర్ 20న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజ‌ర్, ఫస్ట్‌ సింగిల్ లాంచ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.

కాగా ఈ సినిమాలో సీనియర్‌ నటి రేణూదేశాయ్‌ హేమలత లవణం పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమె లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. బిడ్డను ఎత్తుకుని లాలిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్‌ 3న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, అనుకీర్తి వ్యాస్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!