బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో రేణు దేశాయ్!!

నటి రేణు దేశాయ్.. బద్రి, జానీ సినిమాలలో హీరోయిన్ గా చేసింది. పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉన్నది. ఇప్పుడు పవన్ నుంచి విడిపోయి సొంతంగా సినిమాలు చేస్తున్న రేణు దేశాయ్.. తిరిగి టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా టైగర్ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దొంగాట దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదట రానా నటిస్తారని అనుకున్నా.. ప్రాజెక్ట్ అనూహ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళింది. ఈ సినిమా చేసేందుకు బెల్లంకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్ కు అక్కగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇది నిజమో కాదో తెలియాలంటే యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.