పవన్ తో తనప్రేమ రహస్యాన్ని చెబుతా అంటోంది!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తన ప్రేమ పెళ్లి వరకు ఎలా వచ్చిందనే ప్రాసెస్ లో అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకోవడానికి తన మాజీ భార్య రేణు దేశాయ్ ముందుకు రాబోతుంది. మార్చి 8న మహిళా దినోత్సవం సంధర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఇంటర్వ్యూ ద్వారా అందరితో పంచుకునేందుకు రేణు రెడీ అయిపోతుంది. పవన్ తో విడాకులు తీసుకున్న కొన్ని రోజుల తరువాత ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాకు దర్శకత్వం వహించారు రేణు దేశాయ్.

ఈ సినిమాలో పవన్ తనయుడు అకీరా కూడా నటించాడు. ఇదే అతడి మొదటి సినిమా కావడం విశేషం. కానీ ఈ సినిమా రేణుని నిరాశ పరచడంతో ఆలోచనలో పడిపోయింది. పవన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటోన్న రేణు ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి పవన్ తో తన పరిచయం ప్రేమగా ఎలా మారింది. తరువాత పెళ్లి ఎలా జరిగింది వంటి అంశాలను రేణు బయటపెట్టనుంది. మరి ఈ విషయాలు తెలుసుకోవాలంటే మార్చి 8వరకు ఎదురుచూడాల్సిందే!