HomeTelugu Reviewsరివ్యూ: నాగభరణం

రివ్యూ: నాగభరణం

సంగీతం: గురుకిరణ్
ఫోటోగ్రఫీ: వేణు
నిర్మాతలు: సాజిద్, ధవళ్ ఘడ
కథ-కథనం-దర్శకత్వం: కోడిరామకృష్ణ
గ్రాఫిక్స్ తో సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు అమ్మోరు చిత్రంతో కొత్తదనాన్ని పరిచయం
చేశారు దర్శకుడు కోడిరామకృష్ణ. ఆయన నుండి వచ్చే ప్రతి సినిమా ఎంతో వైవిధ్యంగా
ఉంటుంది. అరుందతి చిత్రంతో అనుష్కలో ఉన్న ప్రతిభను అందరికీ తెలియబరచారు. అప్పటినుండి
అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. మళ్ళీ ఇంత కాలం
తరువాత ‘నాగభరణం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ దర్శకుడు. మరి ఈ సినిమా
ఆయనకు ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
సంపూర్ణ గ్రహణం నాడు దేవతలంతా వారి శక్తులను కోల్పోతారు. ఆ సమయంలో ప్రతికూల
శక్తులు, తాంత్రికులు సమస్త ప్రజానీకాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటారు. అలా
జరగకుండా ఉండడానికి దేవతలంతా కలిసి ఓ కలశాన్ని సృష్టించి అందులో వారు శక్తులను
దాచిపెట్టి, గ్రహణం నాడు క్షుద్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేలా చూసుకుంటారు. ఈ కలశానికి
శివయ్య వంశస్థులు రక్షణగా ఉంటారు. వారు నుండి ఈ కళాశాన్ని చేజిక్కించుకోవడానికి
కాపాలి అనే భయంకరమైన తాంత్రికుడు ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగా ఆ వంశానికి
చెందిన శివయ్య(సాయికుమార్)తో పోరాడతాడు. శివయ్యకు బలంగా ఆయన కూతురు
నాగమ్మ(రమ్య) నిలుస్తుంది. నాగమ్మ వీరత్వం ముందు కాపాలి నిలవలేకపోతాడు. కొన్నాళ్ళ
తరువాత ఆమెను అంతం చేసి ఆ కళాశాన్ని దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అందులో
భాగంగా నాగమ్మను చంపేస్తాడు. చివరికి కలశం ఎవరికి దక్కింది..? నాగమ్మ చనిపోయి కూడా
తన ప్రతీకారాన్ని ఏ విధంగా తీర్చుకుంది..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
అరుందతి వంటి సినిమా తరువాత కోడిరామకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో మొదటి
నుండి ఈ సినిమాకు విపరీతమైన హైప్ పెరిగింది. నిజానికి ఈ చిత్రాన్ని కన్నడలో రూపొందించి
తెలుగులో డబ్ చేశారు. కన్నడకు ఇది కొత్త కథే అయినా.. తెలుగుకు మాత్రం ఇది చాలా పాత
కథ. దానికి కొంచెం గ్రాఫిక్స్ జోడించి సినిమా తీశారు. కథ, కథనాలు నాసిరకంగా ఉన్నప్పటికీ
గ్రాఫిక్స్ రూపంలో పామును చూపించే తీరు అధ్బుతంగా ఉంది. అలానే చనిపోయిన విష్ణువర్ధన్
ను మరోసారి తెరపై చూపించిన తీరు ప్రశంసించకుండా ఉండలేము. సినిమా మొదలైనప్పటి
నుండి పాటలు, రొటీన్ సీన్స్ తో నడవడం తప్ప కథలోకి వెళ్లలేదు. సెకండ్ హాఫ్ లో అయినా
కథ మొదలవుతుందా అనుకుంటే పొరపాటే.. కొంచెం సమయం ప్రేక్షకుల సహనానికి పరీక్ష
పెట్టి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చూపించారు. సినిమాలో చెప్పుకోదగ్గది కూడా అదే.. అయితే
అందులో కూడా కొన్ని సన్నివేశాలు అరుందతి సినిమాను తలపిస్తాయి. ఈ సినిమాకు పెద్ద
మైనస్ పాయింట్ రమ్య. టీజర్స్, ట్రైలర్స్ లో ఎలా ఉన్నా.. సినిమా మొత్తం రమ్యను సరిగ్గా
చూపించలేదు. నిజానికి ఆమెకు ఈ రోల్ అసలు సెట్ కాలేదు. సాయి కుమార్ ఉన్నంతసేపు
ఆకట్టుకున్నారు. పాటలు చెప్పుకోదగిన విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది.
టెక్నికల్ గా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అయితే గ్రాఫిక్స్ అవసరం లేని చోట కూడా
పెట్టడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. శివుడు, పాము, విష్ణువర్ధన్ ఈ మూడు సినిమాకు హైలైట్
గా నిలిచాయి. ఇంతకుమించి చెప్పుకోవడానికి పెద్దగా ఏదిలేదు.
రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu