
US Deported Indians demands:
అమెరికా ట్రంప్ పరిపాలనలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో, అనేక మంది భారతీయులను బలవంతంగా తిరిగి భారత్ పంపిస్తున్నారు. అయితే, ఈ డిపోర్టీలపై భారతదేశంలో పెద్దగా సానుభూతి కనిపించడంలేదు. కారణం? వారు చేస్తున్న వింత డిమాండ్లు!
అమెరికా నుంచి తిరిగొచ్చిన కొందరు వారి బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ – “వేరే దేశంలో అక్రమంగా చొరబడిన వారికి, ఇప్పుడు మన దేశంలో రివార్డులు ఇవ్వాలా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరొకరు – “ఇలా వదిలేస్తే భవిష్యత్తులో మరికొందరు ఇదే మోసం చేస్తారు!” అని అభిప్రాయపడ్డారు.
ప్రజలు డిపోర్టీల డిమాండ్లను తప్పుబడుతుండగా, మరోవైపు భారత ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా విమర్శిస్తున్నారు. భారతదేశంలో మంచి ఉద్యోగాలు లేకపోవడం, ఆర్థికంగా స్థిరపడలేక పోవడం, ఇలా అనేక కారణాల వల్లే ఈ యువకులు జీవితాన్ని ప్రమాదంలోకి తీసుకెళ్లి విదేశాలకు వెళ్తున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న వివాదాలను వదిలి, ప్రభుత్వం జనాలకు సురక్షితమైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. అప్పుడే మన ప్రజలు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుని విదేశాలకు అక్రమంగా వెళ్లే అవసరం ఉండదు.
ALSO READ: 20 కోట్ల రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన Jaideep Ahlawat