HomeTelugu Newsఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌, రిషబ్‌ శెట్టి.. కారణం అదేనా!

ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌, రిషబ్‌ శెట్టి.. కారణం అదేనా!

Rishab Shetty NTR Prashan

తాజాగా సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌, రిషబ్‌ శెట్టి కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ తన భార్యతో కలిసి.. సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో శుభకాన్నికి వెళ్లినట్లు తెలుస్తోంది. వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత యలమంచిలి రవి శంకర్‌ కూడా ఉన్నారు.

ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటుగా వెళ్లారు. అదే కార్యక్రమానికి ‘కాంతార’ హీరో రిషబ్‌ శెట్టి కూడా తన సతీమణి ప్రగతితో రావడం జరిగింది. అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తారక్‌తో రిషబ్‌ శెట్టి ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది.

ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జూ ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టి.. కారణం ఇదే

జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ‘కాంతారా’, ‘కేజీఎఫ్‌’ సిరీస్‌లను హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది. అలా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఫోటోకి అభిమానులు భారీగా లైకుల కొడుతున్నారు. ప్రశాంత్‌ నీల్‌- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా నటించనున్నారా అనే ఆసక్తి చర్చ కూడా మొదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!