
Rishab Shetty Personal Life:
రిషబ్ శెట్టిని ఇప్పుడు ఎవరు పరిచయం చేయాలి? ‘కాంతారా’ సినిమా తో తన పేరు పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. డైరెక్టర్ గానే కాదు, హీరోగానూ ప్రేక్షకుల మనసు గెలిచాడు. చిన్న సినిమాగా మొదలై, భారీ హిట్ గా నిలిచిన ‘కాంతారా’ ఇప్పుడు సీక్వెల్ కాంతారా 2 తో రాబోతుంది. కానీ, ఈ స్థాయికి రిషబ్ ఎలా వచ్చాడు? సినిమాలకు ముందు ఏం చేసేవాడు? అన్నదే ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్!
రిషబ్ నిజంగా సినిమాల్లోకి రావాలంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. “నాన్నను డబ్బులు అడగడానికి ఓ నోచుకోలేదు. కూలీ పనులకు వెళ్లేవాడిని. వాటి వల్ల వచ్చిన డబ్బుతో సినిమా చూసేవాడిని” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 2004 నుంచి 2014 వరకు మినరల్ వాటర్ క్యాన్లు అమ్మి గడిపాడట. దానికి తోడు హోటల్స్ లో పని చేశాడు. అలా అడుగడుగునా పోరాటం చేస్తూ, సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేశాడు.
View this post on Instagram
ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. లైట్ బాయ్‌గా కూడా పని చేశాడు. మెల్లగా అవకాశాలు అందుకుంటూ, చివరకు దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా, ‘కిరిక్ పార్టీ’, ‘సర్కారీ హి. ప్రాథమిక శాలే, కాసర్గోಡು’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ‘కాంతారా’ తో వరల్డ్‌వైడ్ గుర్తింపు వచ్చేసింది.
ప్రస్తుతం రిషబ్, కాంతారా 2 తో బిజీగా ఉన్నాడు. అంతే కాదు, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ లో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించనున్నారు.
ALSO READ: Vicky Kaushal కత్రినా కైఫ్ ఇంటి రెంట్ ఎంత కడతారో తెలుసా?