HomeTelugu Newsతమిళనాడులో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

తమిళనాడులో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

4 19
ఈరోజు తెల్లవారుజామున తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పూర్‌ సమీపంలోని అవినాషి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును కంటైనర్‌ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేరళ ఆర్టీసీ బస్సు సేలం నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కంటైనర్‌ లారీ క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. తిరుప్పూర్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు.

తమిళనాడులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం జిల్లా ఓమలూరులో టెంపో వాహనం, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నేపాల్‌ వాసులుగా గుర్తించారు. వీరంతా తీర్థయాత్రల కోసం భారత్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!