మోహన్ బాబు ఇంట్లో చోరీ

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, డబ్బు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. మోహన్‌ బాబు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంట్లో పనిచేసే పనిమనుషులు విచారిస్తున్నారు పోలీసులు. దొంగలు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని పోలీసులు అంటున్నారు. సెలెబ్రిటీల ఇళ్లలోని వస్తువులు చోరీకి గురికావడం ఇటీవల కాలంలో కామన్ గా మారిపోయింది. తెలిసిన వ్యక్తుల్లో లేదంటే ఇంట్లో పనిచేసే వ్యక్తులో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.