బాబు కుట్రను ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు గుర్తించారు: రోజా

ఇవాళ గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తెలంగాణలో ఫలితాలు చూసి ఏపీ ప్రజలు సంతోషపడ్డారని చెప్పారు. ‘కాంగ్రెస్ తో కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ప్రజలు దాన్నే నిజంచేశారు. టీడీపీ-కాంగ్రెస్‌ కలిస్తే ఉరేసుకుంటానని కేఇ కృష్ణమూర్తి అన్నారు. కాంగ్రెస్‌ను టీడీపీని కలిపి తెలంగాణ ప్రజలు ఉరేశారు’ అని రోజు విమర్శించారు.తెలంగాణాలో ప్రజాకూటమి ఓటమికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడే కారణమని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను తికమకపెట్టడానికి లగడపాటిని బాబు ప్రవేశపెట్టారని.. రాజకీయ సన్యాసం చేసిన లగడపాటి సర్వేల సన్యాసం చేస్తే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. నందమూరి ఫ్యామిలీని రాజకీయంగా సమాధి చేయాలన్న కుట్రకు తెర లేపి సుహాసినిని పోటీకి దించారని.. బాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు గుర్తించారని ఆమె అన్నారు టీడీపీని తరమికొట్టడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న రోజా.. నాలుగున్నరేళ్లుగా రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిండాముంచారని విమర్శించారు.