RRR మూవీ నిర్మాతల సెన్సేషనల్ ఆఫర్!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడుతున్నారు. మల్టీస్టారర్ మూవీలకు ఓ ఎగ్జాంపుల్‌గా ఉండేలా చిత్రాన్ని రూపుదిద్దుతున్నారు. ఇద్దరు హీరోల్లో ఎవరినీ తక్కువ కాకుండా చూపించేలా కథను తయారుచేసుకున్నారు.

ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోలు కాబట్టి రెమ్యూనరేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే హీరోలు పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటారని సినీ వర్గాల సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా బడ్జెట్ 200 కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. హీరోలతో పాటు దర్శకుడు కూడా రెమ్యూనరేషన్‌ కాకుండా లాభాల్లో వాటాలు తీసుకునేందుకే నిర్ణయించుకుని నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.