పొలిటికల్‌ పవర్‌ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా: బాలకృష్ణ


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో రూలర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య చేస్తున్న చిత్రం ఇది. ఈసినిమాలో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్‌ వేడుక విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ ఈ చిత్రం రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. మాస్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో కొత్త ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో ”పొలిటికల్‌ పవర్‌ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా.. నువ్వు చచ్చే వరకూ నీతో ఉంటుందనుకోవడానికి.. ఎలక్షన్‌.. ఎలక్షన్‌కి పవర్‌ కట్‌ అయిపోద్ది రా..” అంటూ విలన్‌ని గడగడలాడిస్తున్నారు బాలయ్య.

అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. ”సినిమా వారికి ఉత్తరాంధ్ర వాళ్లు ఇచ్చే గౌరవం.. చూపే అభిమానం ఏరోజుకీ మర్చిపోలేనిది. ఎక్కడా చూడలేనిది. అందుకే ఎన్నో అవకాశాలు ఉన్నా, ఇక్కడే ఫంక్షన్స్‌ జరుపుతాం. షూటింగ్‌లు కూడా చేస్తాం. ఇక్కడి ప్రాంత వాసుల్లో పాజిటివ్‌నెస్‌ ఉంటుంది. గతంలో ‘జైసింహా’తో వచ్చిన కె.ఎస్‌.రవికుమార్‌ మరోసారి అద్భుతమైన చిత్రంతో రాబోతున్నారు. ఇది తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ‘రూలర్‌’ టైటిల్‌ బాలయ్యబాబుకి సరిగ్గా సరిపోతుంది. ‘బాలయ్య రూలర్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌.. రూలర్‌ ఆఫ్‌ ది హార్ట్స్‌..’ ఎందుకంటే ఆయనకు ఒక పాత్ర వస్తే దానికి లొంగిపోతారు. కానీ, ఒకసారి ఆ పాత్రలోకి ప్రవేశించిన తర్వాత ఆ పాత్రను వంచుతారు. అలాగే అభిమానులకు కష్టం వస్తే ఆయన ముందుంటారు. అంతా అభిమానులపై ప్రేమ చూపుతారు. ఆయన అభిమానులు మాదిరిగానే నేను కూడా ‘రూలర్‌’ సినిమా కోసం వేచి చూస్తున్నా” అని అన్నారు. ఇక తన దర్శకత్వంలో బాలకృష్ణ నటించే చిత్రం జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని, హీరోయిన్‌లు విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని తానే స్వయంగా ప్రకటిస్తానని బోయపాటి స్పష్టం చేశారు.

నటుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ”నేను కేవలం బాలకృష్ణ కోసమే ఈ కార్యక్రమానికి వచ్చా. నేను చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే వారిలో ఆయన కూడా ఉంటారు. బాలకృష్ణ తండ్రి ఒక రూలర్‌.. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్న బాలకృష్ణ కూడా అలాగే అయ్యారు. సాధారణంగా సంక్రాంతికి తన కొత్త సినిమాతో వచ్చే బాలకృష్ణ ఆ సీజన్‌ మొత్తం రూల్‌ చేస్తారు. అలాంటిది ఈ సారి సంక్రాంతి కన్నా ముందే వచ్చి అప్పటివరకూ రికార్డులను రూల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక ‘రూలర్‌’.. మరో ‘రూలర్‌’ సినిమాతో రావడం నిజంగా అద్భుతం” అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates