నాని చిత్రంలో ‘ఆర్ఎక్స్100’ హీరో.!

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త చిత్రం నిన్ననే అధికారికంగా లాంచ్ అయింది. ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. నటనలో తనకు స్ఫూర్తినిచ్చే నానితో నటించనుండటం అద్భుతంగా ఉందని అన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి రకరకాల ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నా అసలు కథ ఏమిటనేది గోప్యంగానే ఉంచారు చిత్రబృందం.