HomeTelugu Trending'ఆర్ఎక్స్ 100' దర్శకుడి సంచలన ట్వీట్‌

‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి సంచలన ట్వీట్‌

5 3‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజ‌య్ భూప‌తి తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఒకే ఒక్క మాట ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు కారణమైంది. ‘చీప్ స్టార్’ అని ఆయన అన్న ఒక్క మాట ఎవరిని ఉద్దేశించి అయ్యుంటుందోనని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అజ‌య్ భూప‌తి ‘ఆర్ఎక్స్ 100’ సూపర్ హిట్ కొట్టినా త‌న రెండో సినిమాను ఇంకా ప్రారంభించలేదు. ఆయన తదుపరి చిత్రం నేడో, రేపో అంటూ సాగుతూనే ఉంది. ఆ మధ్య సిద్ధార్థ్ తో అజయ్ భూపతి సినిమాను తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆపై సిద్ధార్థ్ కాదు, రవితేజ హీరో అంటూ మరో వార్త వచ్చింది.

ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ‘మహాసముద్రం’ అని పేరును పెట్టేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఏమైందో ఏమో తెలియదుగానీ, అజయ్ భూపతి తన సోషల్ మీడియాలో ‘చీప్ స్టార్’ అని ఓ కామెంట్ పెట్టాడు. ఇక ఈ ట్వీట్ రవితేజను ఉద్దేశించి చేసిందేనని కొందరు, ఎవరో అజయ్ భూపతే చెప్పాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి అజ‌య్ భూప‌తి నోరు విప్పితే కానీ, దీనికి స‌మాధానం దొరకదు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu