అఖిల్‌ 3వ సినిమా ఫస్ట్‌లుక్‌ అప్పుడేనట..!

అక్కినేని హీరో అఖిల్ మొదటి రెండు సినిమాలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయ్యాడు. అఖిల్‌ తన మూడవ సినిమాను పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఈ  సినిమాని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం చాలా వరకు విదేశాల్లోనే షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఈ నెల 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్బంగా విడుదలచేయనున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. కాగా సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాను క్రిస్టమస్‌ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.