మారుతితో మెగా హీరో!

డైరెక్టర్‌ మారుతి ఇటీవల కాలంలో సినిమాలు వరసగా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు విజయం సాధించాయి. శైలజా రెడ్డి అల్లుడు విడుదల అయ్యి చాలా రోజులైంది. మారుతి.. నానితో కలిసి సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం నాని చాలా బిజీగా మారిపోయాడు. జెర్సీ, ఆ తరువాత విక్రమ్ కుమార్ తో సినిమా, ఇంకా కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు. వాటిలో మారుతి సినిమా కూడా ఉంది.

ఈ సినిమాలు కంప్లీట్ అయ్యి మారుతి దగ్గరకు వచ్చే సరికి చాలా ఆలస్యం అవుతుంది. అందుకే మారుతి మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. నాని, శర్వానంద్ లకు మంచి హిట్ ఇచ్చినట్టుగానే సాయి ధరమ్ తేజ్ కు కూడా మారుతి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.