లిప్ లాక్స్‌కి నో పర్మిషన్..!

తెలుగు పరిశ్రమలో ‘ఫిదా’ మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్‌ సాయి పల్లవి. ఈమె సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అలాగే తమిళ పరిశ్రమలో కూడ ఈమెకు క్రేజ్ ఎక్కువే. అందుకే వరుస ఆఫర్లతో బిజీగా ఉంది ఈ మలయాళీ హీరోయిన్. ఆచితూచి స్టోరీలను సెలెక్ట్ చేసుకునే ఆమె సినిమాలకు కొన్ని రూల్స్ కూడ పెట్టుకుందట. వాటిలో పొట్టి పొట్టి దుస్తులు వేసుకోకూడదు అనేది ఒకటైతే ఇంకొకటి లిప్ లాక్స్ లాంటివి ఉండకూడదు. ఇవి లేకుంటేనే సినిమా అయినా చేస్తానని, ఎందుకంటే నా పేరెంట్స్ సినిమా చూసేప్పుడు అసౌకర్యంగా ఫీలవ్వకూడదనేది తన ఉద్దేశ్యమని అందుకే ఈ రూల్స్ అని అంటోంది.