
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది రౌడీబేబి సాయిపల్లవి. మహేష్ అందంపై ప్రశంసలు కురిపించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మహేష్‌బాబు చాలా అందంగా ఉంటాడని కితాబునిచ్చింది. ఆయన స్కిన్ ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉంటుందని చెప్పింది. తాను మహేష్ బాబు ఫొటోలు చూస్తున్న సమయంలో లుక్స్ పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడోనని ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. చాలాసార్లు ఆయన ఫొటోల్ని జూమ్ ఇన్‌లో చూసేదానినని చెప్పింది. మహేష్ ముఖంపై ఒక్కమచ్చ కూడా ఉండదని చెప్పింది. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య హీరోగా వస్తుంది. ఈ సందర్భంగానే ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.













