నాగచైతన్య, సాయి పల్లవి మూవీ ప్రారంభం

అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని వినాయకుడి ఆలయంలో గురువారం సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఫిదా’ సినిమాతో మంచి విజయం అందుకున్న శేఖర్‌ కమ్ముల.. తర్వాత ఎలాంటి కథతో వస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ‘ఫిదా’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవినే మళ్లీ తన సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకుని అంచనాలను పెంచేశారు. నారాయణదాస్‌ నారంగ్‌, రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలైంది. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 2019 చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.