HomeTelugu Newsమెగా హీరో సరసన బాలీవుడ్‌ హీరోయిన్

మెగా హీరో సరసన బాలీవుడ్‌ హీరోయిన్

9a 2
మెగా వరసుడు వరుణ్ తేజ్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల గద్దల కొండ గణేష్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు వరుణ్ తాజాగా ఈ యంగ్ హీరో కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో ఒక సినిమాచేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను అల్లు బాబీ, సందీప్ కలిసి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ నటిస్తుందని తెలుస్తుంది. ఆ భామ ఎవరంటే సయీ మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు ఈ బ్యూటీ. సల్మాన్ ఖాన్‌ సరసన దబాంగ్ 3 సందడి చేసింది. ఇక త్వరలో ఈ అమ్మడిని హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu