
Salman Khan remuneration for Bigg Boss 19:
బిగ్‌బాస్ 19 షో ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈసారి షో జులై నుంచే ప్రారంభం కావచ్చని బజ్. ఇది ఇప్పటివరకు బిగినే జరిగిన పెద్ద కాలం నడిచే సీజన్ అవుతుందట – దాదాపు 5.5 నెలల పాటు.
ఇప్పటివరకు లీకైన సమాచారం ప్రకారం, ఈ సీజన్ హోస్ట్‌గా మళ్లీ సల్మాన్ ఖాన్ బాగానే కొనసాగనున్నారు. జూన్‌లోనే ఆయన తొలి ప్రోమో షూట్ చేయబోతున్నారని టాక్. అయితే, ఈసారి నిజంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది ఆయన రెమ్యూనరేషన్.
బిగ్‌బాస్ 18 కోసం సల్మాన్ దాదాపు రూ. 250 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఇప్పుడు అదే రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లను దాటనుందని తాజా బజ్. ఇప్పటికే OTT 2 కోసం ఆయన వారాంతానికి రూ. 12 కోట్లు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి – మొత్తానికి రూ. 96 కోట్లు.
బిగ్‌బాస్ 17లోనూ ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ. 6 కోట్లు తీసుకుని మొత్తం రూ. 200 కోట్లు సంపాదించినట్టు రిపోర్ట్.
ఇప్పుడు బిగ్‌బాస్ 19ను సల్మాన్ మళ్ళీ హోస్ట్ చేయడం, ఇంకా పెరిగిన పారితోషికం తో షో గ్రాండియర్ గా మారబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.