నిహారిక గురించి మళ్లీ చెప్పిన నాగశౌర్య..!

యువ కథానాయకుడు నాగశౌర్య, నటి నిహారిక ఇద్దరూ కలిసి ‘ఒక మనసు’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే తమ మధ్య ఎటువంటి బంధం లేదని వీరిద్దరూ దీనిపై అప్పట్లోనే క్లారిటీ ఇచ్చేశారు. రెండు రోజుల క్రితం నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాబును ఎత్తుకుని ఉన్న చక్కటి ఫొటోను షేర్‌ చేశారు. ఇద్దరిలో ఎవరు క్యూట్‌గా ఉన్నారు? అని ప్రశ్నించారు. దీనికి నాగశౌర్య.. ఇద్దరికీ దిష్టి తీయాలి అని కామెంట్‌ చేశారు. దీంతో మళ్లీ వీరి మధ్య ప్రేమ గురించి ప్రచారం మొదలైంది. త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చేశాయి.

దీనిపై నాగశౌర్య స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని చెప్పారు. నేను, నిహారిక పెళ్లి చేసుకోబోతున్నామని తెగ వార్తలు రాస్తున్నారు. కానీ మేం ప్రేమలో లేము.. అంతెందుకు గత రాత్రి నా స్నేహితులు ఫోన్‌ చేసి.. మీ కథేంటి? అని అడిగారు. దాంతో షాక్‌ అయ్యాను. ఈ ప్రచారం ఇంకా ఎంత వరకూ వెళ్తుందో, ఎప్పుడు దీనికి ముగింపు వస్తుందో చూడాలి. నిహారిక విషయం పక్కన పెట్టండి, నేను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్‌లో లేను అని తేల్చి చెప్పారు