వివాదంలో ‘దబాంగ్ 3’

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘దబాంగ్ 3’ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఇండోర్ లో ప్రారంభమైంది. సల్మాన్ పుట్టిన స్థలం ఇండోర్ కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేయాలనీ యూనిట్ భావించి షూటింగ్ స్టార్ట్ చేసింది. కాగా, ఇప్పుడు దబాంగ్ 3 వివాదంలో చిక్కుకుంది.

షూటింగ్ సమయంలో సెట్స్ లో ఉన్న శివలింగాన్ని చెక్కల కింద ఉంచారని చెప్పి వివాదం రేగింది. ఈ వివాదం పెద్దది కావడంతో చాలా పెద్ద గొడవ జరిగింది. దీనిపై సల్మాన్ అండ్ కో వివరణ ఇచ్చింది. షూటింగ్ చేసే సమయంలో శివలింగం పాడైపోకూడదని చెప్పి చెక్కలతో దానిని కప్పేశామని షూటింగ్ ముగిసిన వెంటనే తీసేస్తామని సల్మాన్ వివరణ ఇచ్చారు.

CLICK HERE!! For the aha Latest Updates