HomeTelugu Big Storiesసీక్రెట్‌ టాటూని చూపించేసిన సమంత!

సీక్రెట్‌ టాటూని చూపించేసిన సమంత!

12 5స్టార్‌ హీరోయిన్‌ సమంత తన శరీరంపై ఉన్న సీక్రెట్‌ టాటూని బయటపెట్టేశారు. ఆమె ఆదివారం నిర్వహించిన ‘ఓ బేబీ’ థాంక్స్‌ మీట్‌లో తెలుపు వర్ణం దుస్తుల్లో మెరిశారు. ఫొటోషూట్‌లో భాగంగా చేతులు పైకెత్తి పోజిచ్చారు. ఈ సందర్భంలో ఆమె కుడి వైపు పక్కటెముకల వద్ద ఉన్న టాటూ బయటపడింది. తన ప్రియమైన భర్త నాగచైతన్య పేరును సామ్‌ పచ్చబొట్టు వేయించుకున్నారు. ఈ ఫొటోను సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నా.. నేను దాచిపెట్టిన ఒకే ఒక్క టాటూ చివరికి బయటపడింది. నాగచైతన్య నా భర్త, నా ప్రపంచం’ అంటూ లవ్‌ సింబల్స్‌ను పోస్ట్‌ చేశారు.

కొన్నేళ్ల క్రితం చైతన్య, సామ్‌ చేతిపై ఒకేరకం టాటూని వేయించుకున్నారు. అప్పట్లో ఫొటోలు కూడా తెగ వైరల్‌ అయ్యాయి. ఈ టాటూ గురించి సామ్‌ మాట్లాడుతూ.. ‘దీనర్థం మీ జీవితం మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, అంతేకానీ ఇతరుల మాటల్ని బట్టి కాదు’ అని వివరించారు. 2017లో సామ్‌తో పెళ్లి తర్వాత చైతన్య మోర్స్‌ కోడ్‌ను టాటూ వేయించుకున్నారు. దీన్ని అభిమానులు డీ కోడింగ్‌ చేస్తూ.. పెళ్లి రోజును ఆయన టాటూగా వేయించుకున్నారని అభిప్రాయపడ్డారు.

12a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!