సమంత రిసప్షన్ వెన్యూ అక్కడే!

గత కొంత కాలంగా ఏదొక విధంగా సమంత వార్తల్లో నిలుస్తూనే ఉంది. తను ఎప్పుడు బయట కనిపించినా.. మీడియా తన ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూనే ఉంది. వారికి తన స్టయిల్ లో సమాధానాలు చెప్పి షాక్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా సమంత టీగ్రిల్ అనే రెస్టారంట్ ప్రారంభోత్సవ వేడుకకు వెళ్లింది.

ఈ రెస్టారంట్ సమంత స్నేహితురాలు నీరజ కోన, హీరో నితిన్ కలిసి పెట్టిన ఓ జాయింట్ వెంచర్. ఈ రెస్టారంట్ సమంత చేతుల మీదగా ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సమంత తనకు తెలంగాణ వంటలు అంటే చాలా ఇష్టమని చెప్పింది.

అంతేకాదు తనకు వంట చేయడం రాకపోయినా.. చేసిన వంట రుచి చూసి చెప్పడంలో తనే సూపర్ అని చెబుతోంది. మీడియా నుండి తనకు పెళ్లి ప్రశ్నలు ఎదురుకాకపోవడంతో అందరూ నా పెళ్లి గురించే అడుగుతారని అనుకున్నానే అంటూ కౌంటర్ వేసింది.

పెళ్లి ఎప్పుడనే విషయాన్ని ఈ  బ్యూటీ చెప్పలేదు కానీ.. ఇదే రెస్టారంట్ లో నా పెళ్లి రిసప్షన్ పెడతానని చెప్పింది. మొత్తానికి రిసప్షన్ వెన్యూ ఫిక్స్ చేసెసింది ఈ భామ.