
ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. సీజన్-2లో సమంత అక్కినేని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సమంత పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో సమంత పెర్‌ఫార్మెన్స్ హాట్ టాపిక్ అయింది. సమంత ఇప్పటివరకు నటించినది ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరో రేంజ్‌లో నటించింది. ఎవరూ ఊహించని బోల్డ్ క్యారెక్టర్ పాత్ర కావడంతో మరింత చర్చనీయాంశమైంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ లో టెర్రరిస్ట్ రాజీపాత్రలో సమంత నటించింది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు సామ్ నుండి ఊహించనివి చాలా ఉన్నాయి.
సమంత వెబ్ సిరీస్ ప్రారంభంలో చెప్పినట్లుగానే ఫేవరేట్ నెగెటివ్ బోల్డ్ రోల్ అని నిరూపించింది. సాధారణంగా హీరోయిన్స్ పెళ్లికి ముందే ఇలాంటి బోల్డ్ రోల్స్ లో కనిపిస్తారు. పెళ్లయ్యాక రొమాంటిక్ రోల్స్‌కి దూరంగా ఉంటారు. కానీ సమంత వాటికి డిఫరెంట్‌గా వెళ్తోంది. పెళ్లి వరకు డీసెంట్ గ్లామరస్ రోల్స్ చేసిన సమంత పెళ్లి తర్వాత సూపర్ డీలక్స్ సినిమాతో షాకిచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్-2తో మరింత సర్‌ఫ్రైజ్ అని చెప్పాలి. క్యారెక్టర్ డిమాండ్ మేరకే బోల్డ్ సన్నివేశాల్లో నటించినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్లలో తన టాలెంట్‌ను మరో కోణంలో చూపించి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది.













