HomeTelugu TrendingSamantha దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు ఏంటో తెలిస్తే షాకే..

Samantha దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులు ఏంటో తెలిస్తే షాకే..

List of Expensive Items owned by Samantha!
List of Expensive Items owned by Samantha!

Expensive Items owned by Samantha:

టాలీవుడ్ బ్యూటీ Samantha గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటికప్పుడు ట్రెండ్లో ఉండే ఈ మలయాళ కుట్టి, ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. విషయం ఏంటంటే… సమంత దగ్గర ఉన్న ఖరీదైన వస్తువుల లిస్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది.

ముందుగా చెప్పుకోవాల్సింది సమంత హైదరాబాద్లో ఉన్న ఇంటి గురించే. ఈ ఇల్లు సుమారుగా రూ.30 కోట్ల విలువ చేస్తుందట. అంతేకాదు, ఆమె దగ్గర కార్ల కలెక్షన్ కూడా మామూలుగా లేదు. ల్యాండ్ రోవర్ కార్ విలువ రూ.2.30 కోట్లు. మరోవైపు పోర్షే కేమాన్ జీటీఎస్ అనే స్పోర్ట్స్ కారు ఆమె వద్ద ఉంది, దీని ఖరీదు రూ.1.46 కోట్లు. వీటికి తోడు మరిన్ని కార్లు కూడా ఆమె కలెక్షన్లో ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఇంకా సామ్ ఫ్యాషన్ ప్రపంచంలో కూడా టాప్ గేర్‌లో ఉంది. ఆమె దగ్గర రెండు లక్షల రూపాయల విలువ చేసే లూయీస్ విట్టన్ బ్యాగ్ ఉంది. మరో బ్యాగ్ క్రిస్టియన్ డియర్ బ్రాండ్‌ది, దాని ఖరీదు సుమారు రూ.2.5 లక్షలు. జీజీ మార్మోంట్ స్లింగ్ బ్యాగ్ కూడా ఆమె స్టైల్ ఐటమ్‌లలో ఒకటి. హీల్స్ అంటే మక్కువ ఉన్న సమంత దగ్గర మనోలో బ్లాహ్నిక్ బ్రాండ్ బ్లాక్ హీల్స్ ఉన్నాయి, వీటి విలువ సుమారు రూ.1 లక్ష.

ఇవి మాత్రమే కాదు, “సాకీ” అనే దుస్తుల బ్రాండ్‌లో సుమారు రూ.30 కోట్ల మేర వాటా కూడా సమంతకి ఉందట. అలాగే ముంబైలో ఉన్న ఖరీదైన ఇల్లు, ఇతర ఆస్తుల గురించి కూడా వార్తలు వస్తున్నాయి.

తెలుగులో సినిమాలు తక్కువ చేస్తున్నా, సమంత పేరు మాత్రం రోజూ వార్తల్లో వింటూనే ఉంటోంది. ఆమె లైఫ్ స్టైల్ చూస్తే నిజంగా గ్లామర్ ప్రపంచంలో ఆమె ఎలా రూల్ చేస్తుందో అర్థమవుతుంది!

ALSO READ: Google.com ని ఒక వ్యక్తి 1000 రూపాయలకి కొనేశాడా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!