ఆగస్ట్ లో సమంత పెళ్లి..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య, సమంతలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమకు ఇరుకుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే వీరి వివాహానికి ముందుగా చైతు తమ్ముడు అఖిల్ వివాహం జరగనుంది. అఖిల్ నిశ్చితార్ధం డిసంబర్ లో జరగనుంది . వచ్చే ఏడాది మేలో అఖిల్ వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అలానే చైతు, సమంతల వివాహం వచ్చే ఏడాది ఆగస్ట్ లో చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

చైతు హిందూ మతస్థుడు.. సమంత క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయి.. కాబట్టి రెండు సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వీరి వివాహం జరపనున్నారు. ముందుగా హైదరాబాద్ లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపి, ఆ తరువాత చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం జరపనున్నారని సమాచారం.

పెళ్లి కోసం సమంత ఇప్పటినుండే నగలు, చీరు కొనుగోలు చేస్తోందని టాక్. ప్రస్తుతం అమ్మడు మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. వీటిని వీలైనంత తొందరగా పూర్తి చేసి పెళ్లి రెడీ అవ్వాలనేది సమంత ఆలోచన.