HomeTelugu Trendingసంపూర్ణేష్‌బాబు 3.30 నిమిషాలు.. సింగిల్‌ షాట్‌ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

సంపూర్ణేష్‌బాబు 3.30 నిమిషాలు.. సింగిల్‌ షాట్‌ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

9 26బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని పెద్ద డైలాగ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగల్ షాట్ డైలాగ్ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట” అంటూ ఈ వీడియో గురించి సంపూ చెప్పారు. ‘ఏరా పెద రాయుడు.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూ డైలాగ్‌.. ‘పెదరాయుడు టైమ్‌ ఈజ్‌ వోవర్‌.. ఆండ్రాయుడు టైమ్‌ స్టార్ట్స్‌ నౌ..’ అంటూ 3.30 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగింది. ‘అన్నా డైలాగ్‌ అద్భుతంగా చెప్పావ్‌..’ అంటూ ఈ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ ‘కొబ్బరిమట్ట’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్టీవెన్‌ శంకర్‌ కథ అందించారు. నీలం సాయి రాజేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu