కార్తీ సినిమా సీక్వెల్ లో సందీప్!

తమిళ హీరో కార్తీ నటించిన ‘నా పేరు శివ’ తెలుగు ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. ఆ సినిమాతోనే కార్తీకి కూడా తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. సీక్వెల్ అంటే అదే హీరో, హీరోయిన్ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. సీక్వెల్ గా హీరో, హీరోయిన్ గా సందీప్ కిషన్, మెహ్రీన్ ను ఎన్నుకున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకొంది. ద్విబాషా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకు నాపేరు శివ సినిమా టెక్నికల్ టీంనే పనిచేస్తోంది.
సుశీంద్రన్ నాపేరు శివ సీక్వెల్ కోసం మంచి కథను సిద్ధం చేసుకున్నాడట. అంతా బాగానే ఉంది కానీ సీక్వెల్ అంటున్నారు హీరో, హీరోయిన్స్ ను మార్చేశారు. ఎంత కథ కొత్తగా ఉన్నా.. సీక్వెల్ అనే పదానికి ఎలా న్యాయం చేస్తారో.. చూడాలి. ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగులో నక్షత్రం సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో మాత్రం రెండు, మూడు సినిమాలు లైన్ లో పెట్టేశాడు. ఎటు చూసుకున్నా.. సందీప్ కు తెలుగు కంటే తమిళంలోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు కనిపిస్తోంది.  
 
 
Attachments