తాప్సీతో అఫైర్ లేదంటున్నాడు!

బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగాలని ప్రయత్నిస్తోంది తాప్సీ పన్ను. పింక్ సినిమాతో నటిగా మంచి పేరైతే సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా ఆమె నటుడు సాకీబ్ సలీంతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది అమ్మడు తన పుట్టినరోజు సంధర్భంగా సాకీబ్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం, వారిద్దరు సన్నిహితంగా మెలగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా సాకీబ్ ఈ విషయంపై స్పందించాడు. 
ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదని తేల్చేశాడు. తమ మధ్య ఉన్నది కేవలం వృత్తిపరమైన రిలేషన్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. బయట చాలా మంది తనను తాప్సీతో మీకున్న రిలేషన్ ఏంటని పదే పదే అడిగి విసుగు తెప్పిస్తున్నారని అన్నాడు. నిజానికి మా ఇద్దరి అభిరుచులు చాలా దగ్గర ఉంటాయి. సో.. మేమిద్దరం కలిసి సమయం గడపడానికి ఇష్టపడతాం. తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అంతకుమించి మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. పస్తుతం వీరిద్దరూ కలిసి ‘మక్నా’ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఇకనైనా.. సాకీబ్ మాటలతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!