బుల్లితెరపై భళ్లాలదేవుడు!

ఈ మధ్య కాలంలో వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కనిపించి అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు స్టార్ హీరోలు. నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ద్వారా సందడి చేయగా, మెగాస్టార్ చిరంజీవి అదే కార్యక్రమాన్ని తన వాఖ్చాతుర్యంతో రక్తి కట్టించారు. ఈ నేపధ్యంలో హిందీలో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో తెలుగు వెర్షన్ కోసం ఎన్టీఆర్ ను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రానా కూడా ఓ టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

ఇది సెలబ్రిటీలకు సంబంధించిన సరికొత్త కాన్సెప్ట్ అని సమాచారం. ఆసక్తికరమైన విశేషాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అంటున్నారు. ఆల్రెడీ ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగు జరుగుతోందట. త్వరలోనే ఒక ప్రముఖ ఛానల్ లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.