HomeTelugu Trendingసూపర్‌ స్టార్‌తో సారా అలీఖాన్‌ రొమాన్స్‌..

సూపర్‌ స్టార్‌తో సారా అలీఖాన్‌ రొమాన్స్‌..

10 1
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే మహేష్ తన తర్వాతి సినిమా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఉంటుందని అంత అనుకున్న సీన్ లోకి పరశురామ్ ఎంటర్ అయ్యాడు.. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా ఎవరిని సెలక్ట్ చేసే పనిలో ఉన్నాడు పరశురామ్ ఈ చిత్రానికి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడు. అలాగే భరత్ అనే నేనులో మహేష్ సరసన నటించి మెప్పించిన కియారా అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా ఉందిట. తర్వాత మహానటి కీర్తి సురేష్ పేరుకూడా వినిపించింది. ఇప్పుడు తాజాగా ఇంకో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయబోతుంది అనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదనేది తెలియాలంటే మూవీయూనిట్‌ ప్రకటించే వరకు ఎదురు చుడాలిసిందే .

Recent Articles English

Gallery

Recent Articles Telugu